ఒక వైపు కరోనా కోరలు చాస్తుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ క్రమంలో విశాఖలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ ఆస్పత్రిగా మార్పు చేశారు. వంద పడకలతో ఇక్కడ బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స అందించనున్నారు.
విశాఖ జిల్లాలో కొత్తగా అయిదు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి బాధితుల సంఖ్య 172కు చేరింది. కొత్తగా వచ్చిన అయిదుగురు కేజీహెచ్‌లో చేరారని, వీరికి చికిత్స అందజేస్తున్నామని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు.
ఇదీ చదవండి:
CM Jagan in Delhi: దిల్లీలో సీఎం.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం