హైందవ సంప్రదాయంపై అవగాహన లేని ప్రభుత్వమే అరెస్టులు చేయిస్తుందని విశాఖలో ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. అరెస్టు చేసిన భాజపా నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనలో దోషులను శిక్షించాలని కోరారు. ఆలయాల పవిత్రత తెలియకుండా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని దించేవరకు భాజపా కృషి చేస్తుందని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజాస్వామ్యంపైనే వైకాపా దండయాత్ర చేస్తోందని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే అరెస్టు చేస్తారా?అని మండిపడ్డారు. హిందువులకు రక్షణ లేదనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి. అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం