విశాఖ జిల్లా నర్సీపట్నంలో భాజపా-జనసేన నాయకులు సంయుక్తంగా నిరసనకు దిగారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా... లబ్ధిదారులకు కేటాయించకపోవటంపై నేతలు ఆందోళన చేశారు. నర్పీపట్నం మున్సిపాలిటీలో నిర్మించిన గృహ సముదాయాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా... ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోయారని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి పేదలకు ఇళ్లను కేటాయించాలని సూచించారు.
ఇదీ చదవండి: పేదలకు ఇళ్ల కేటాయింపులో జాప్యంపై భాజపా నిరసన