పొగ మంచు... తగ్గేందుకు చలి మంటలు.. ఇదంతా విశాఖ మన్యంలో అక్టోబర్ నుంచి జనవరి వరకు వినబడే మాట. కానీ ప్రస్తుతం కాలం మారింది. వేసవి సెగ తగిలినప్పటికీ విశాఖలో చలి మాత్రం తగ్గలేదు. సాయంత్రం నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కొండకోనల్లో మంచు అందాలు కట్టి పడేస్తున్నాయి. పర్యాటకులు మన్యం వైపు పరుగులు తీస్తున్నారు. చలి మంటలు వేసుకుని సేదదీరుతున్నారు. కొండలెక్కి మన్యంలోని మంచు సోయగాలను వారి కెమెరాల్లో బంధిస్తున్నారు. ఇంత చలికి కారణం పాడేరులో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవటమే.
ఇదీ చదవండి: వాడిన పూలతో అగర్ బత్తీలు..