'నాపై నమోదైన కేసును ఎత్తివేయండి' - అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు వార్తలు
తనపై నమోదైన కేసును ఎత్తివేయాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దురుద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేశారని అందులో వివరించారు.
ayyana patrudu filed quash petition in high court
విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో తనపై నమోదు అయిన కేసును ఎత్తివేయాలని కోరుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని పిటిషన్లో కోరారు. తనపై కావాలనే కేసు నమోదు చేసినట్లు అయన పేర్కొన్నారు. నర్సీపట్నం పురపాలక సంఘం కమిషనర్ ఫిర్యాదుతో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు నమోదైన విషయం తెలిసిందే.