ETV Bharat / state

పాడేరులో ప్రపంచ ఆదివాసి దినోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

విశాఖ మన్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు హాజరు కానున్నారు.

ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 9, 2021, 2:55 PM IST

పాడేరులో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

ప్రపంచ ఆదివాసి దినోత్సవాలు విశాఖ జిల్లా మన్యం పరిధిలోని పాడేరులో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. ఆదివాసి వేడుకలను తిలకించేందుకు గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు హాజరు కానున్నారు.

మంత్రుల రాక దృష్ట్యా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకులోయ ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ముందస్తుగా ఏర్పాట్లు పరిశీలించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శెట్టి పాల్గుణ... తలపాగాకు ఆకులు చుట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. థింసా బృందంతో కలిసి నృత్యం చేశారు.

ఇదీ చదవండి:

మోదీ బొమ్మతోనే ఉచిత రేషన్‌ పంపిణీ చేయండి: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.