ఏయూ సెట్ - 2020 రెండో దశ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసినట్లు ఏయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు ఆచార్య డిఏ నాయూడు తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు రెండో దశ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాల అప్లోడింగ్కు అవకాశం ఉందన్నారు.
25 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్ చేసుకోవచ్చునని వెల్లడించారు. 30 వ తేదీన సీట్లు కేటాయిస్తామనీ.. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో ఫీజు చెల్లించాలని వివరించారు. ఫిబ్రవరి 2న కోర్సు వివరాలతో ప్రిన్సిపల్ కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: