విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏయూ సెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. ర్యాంకు వివరాలు వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య డీఏ నాయిడు చెప్పారు.
ఈ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుందని ఆయన తెలిపారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ... త్వరలో కౌన్సెలింగ్ తేదీలు విడుదల చేస్తామన్నారు. ఆర్ట్స్ , సైన్స్‌తో పాటు కొన్ని ప్రొఫిషనల్ కోర్స్‌లకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహణకు యూనివర్సిటీ రంగం సిద్ధం చేసింది. www.andhrauniversity.info, andhra university.edu.in/admissions వెబ్సైట్లో ఫలితాలు, ఇతర సమాచారం పొందవచ్చు.
ఇదీ చూడండి: