ETV Bharat / state

ఏయూ ముట్టడి... అపరాధ రుసుం పెంపే కారణం..! - అపరాధ రుసుముపై ఏయూ విద్యార్ధుల ధర్నా

సెమిస్టర్​ ఫీజు పెంచుతామన్న ముందస్తు సమాచారం లేదు. నోటీస్ బోర్డులో 55 రూపాయలని చెప్పి... 400కు పెంచటంపై ఏయూ విద్యార్థులు ఆగ్రహించారు. వర్సిటీ ముట్టడి చేపట్టి... అపరాధ రుసుం తగ్గించాలని డిమాండ్ చేశారు.

au all side roads are closed by students for increasing of semister fee in andra university
ఏయూ అష్టదిగ్బంధనం.. అపరాధ రుసుమే కారణం..!
author img

By

Published : Jan 31, 2020, 7:11 PM IST

ఏయూ ముట్టడి... అపరాధ రుసుం పెంపే కారణం..!

సెమిస్టర్ ఫీజులపై అపరాధ రుసుం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ... ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేశారు. అపరాధ రుసుం 55 రూపాయలుగా నోటీస్ బోర్డులో ప్రకటించి... ఒక్కో సెమిస్టర్​కు 400 రూపాయలు పెంచడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా... ఇష్టానుసారంగా రుసుం పెంచడం సమంజసం కాదన్నారు.

వర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ... వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే దారులను నిర్బంధించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుంచి వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే దారిలో.. మానవహారంగా ఏర్పడి శాంతియుత నిరసన తెలిపారు. పెంచిన అపరాధ రుసుం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఫిబ్రవరి 2న విశాఖలో 'బ్రహ్మనందం' సినీ జీవిత విజయోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.