సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవానికి కావల్సిన గంధం చెక్కలు సిద్ధమయ్యాయి. అప్పన్న చందనోత్సవం ఈనెల 14న జరగనుంది. స్వామివారి నిజరూప దర్శనం తర్వాత సహస్ర ఘట్టాభిషేకం జరగనుంది. అనంతరం చందనం సమర్పించనున్నారు. దీని కోసం గంధం కర్రలు నుంచి చందనాన్ని తీసేందుకు వీలుగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేశారు. సుమారు 120 కేజీల చందనంలో సుగంధద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పించనున్నారు.
ఇవీ చదవండి: