ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో.. చల్లటి వాతావరణాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త రకపు పంటలపై దృష్టి సారిస్తున్నారు. వారికి పాడేరు ఐటీడీఏ అధికారులు ప్రోత్సాహం ఇస్తున్నారు. తమ వంతు సాయం చేస్తున్నారు. అరకు లోయ, డుంబ్రిగూడ, హుకుంపేట, చింతపల్లి తదితర మండలాల్లో అభ్యుదయ రైతులను గుర్తించి పాడేరు ఐటీడీఏ అధికారులు ఒక్కొక్కరికీ వంద యాపిల్ మొక్కలు అందించారు. రెండున్నరేళ్ల క్రితం తోటల్లో నాటిన ఈ మొక్కలు.. ఇన్నాళ్లకు దిగుబడిని అందిస్తున్నాయి.
ఆంధ్రాలో యాపిల్ పండు..అందే ద్రాక్షే..! మారుతున్న సాగు సంప్రదాయపు పండ్ల తోటలను కూరగాయలను కాకుండా భిన్న రకమైన తోటల పెంపకంపై దృష్టి సారిస్తే మంచి లాభాలు పొందవచ్చని గిరి రైతులను చూస్తే అర్థమవుతోంది. ఈ దిశగా... రెండేళ్ల క్రితం నాటిన యాపిల్ మెుక్కల నుంచి పండ్లు చేతికి వస్తున్నాయి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే యాపిల్ తోటల నుంచి లాభాలు పొందవచ్చని రైతులు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు... కూరగాయల సాగుపైనా దృష్టి సారిస్తున్న రైతులు... క్యాప్సికమ్, బజ్జి మిరప వంటి కొత్త రకపు పంటలూ సాగు చేస్తున్నారు.
వీటికి డిమాండే వేరు
అరకు పరిధిలో పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసుకుని వెళ్తారు. ప్రభుత్వం సహకారం అందిస్తే వందలాది ఎకరాల్లో యాపిల్, క్యాప్సికం లాంటి పంటలు సాగుచేస్తామని రైతులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: రెండు రోజుల బాబు మిస్... రెండు గంటల్లోనే దొరికాడు!