విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీకేజీ ఘటనకు స్టైరీన్ అనే రసాయనం ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశామని... హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుచరిత వివరించారు. ఈ ఘటనపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్న హోంమంత్రి... ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని సుచరిత తెలిపారు.
ఇదీచదవండి.