ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ విశాఖ జిల్లా నర్సీపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రాల్లో 775 శాఖల ద్వారా రూ.34 వేల కోట్లతో వ్యాపారం కొనసాగిస్తున్నామని తెలిపారు. రికవరీ బాగున్నప్పుడే ఏ బ్యాంకు అభివృద్ధి అయినా ముందుకు సాగుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో లక్షా తొంభై మూడు వేల మహిళా సంఘాలకు రూ. 5800 కోట్లను పంపిణీ చేశామన్నారు. వీటిని మరింత విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి