ఒమిక్రాన్ వేరియెంట్ కారణంగా దేశంలో మూడో దశ కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో... కరోనా రెండు దశల్లో పాటించిన జాగ్రత్తలు కొనసాగించాలన్నారు. వాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బూస్టర్ డోస్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుని అమలు చేస్తే... ఈ వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుంటుందన్నారు. మరోవైపు మూడోదశను ఎదుర్కొనేందుకు.. గతంతో పోలిస్తే ఆస్పత్రుల్లో వసతులు మెరుగ్గా ఉండటం మంచి పరిణామని చెబుతున్న డాక్టర్ పీవీ సుధాకర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి....
ఇదీ చూడండి: ఆ పాఠశాలలో 'భోజనమాత' వివాదానికి తెర.. కుదురిన సయోధ్య!