విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య విశాఖలో ఆందోళన చేపట్టింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ప్రకటించినా ఇప్పటికీ అమలు చేయలేదని సమాఖ్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. విభజన హామీల అమలు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: అంతర్ రాష్ట్ర బస్సుల్లో టిక్కెట్లు తెగుతున్నాయి!