విశాఖ జిల్లాలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో మూడో రోజూ అనిశా సోదాలు కొనసాగుతున్నాయి. పద్మనాభం మండలంలో భారీగా పట్టాదారు పాసు పుస్తకాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సీతమ్మధార కార్యాలయంలో లంచం ఆరోపణల ఫిర్యాదులు, దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. డిజిటల్ కీ వినియోగం సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు.
నిన్న 12 తహశీల్దార్ కార్యాలయాల్లో...
బుధవారం విశాఖ, విజయనగరం జిల్లాల్లోని 12 తహశీల్దార్ కార్యాలయాల్లో అనిశా తనిఖీలు చేసింది. విశాఖ జిల్లాలోని సీతమ్మ ధార, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ గ్రామీణం, అచ్యుతాపురం కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు... ఉద్యోగుల హాజరు, వారి విధి నిర్వహణ పట్టీలు అలాగే అందిస్తున్న సేవలను పూర్తిగా పరిశీలలించారు.
ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి.. అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయాల మీద వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. కొద్దీ రోజులు కిందే భీమిలి తహసీల్దారు కార్యలయంలో ఉద్యోగులపై చర్యలు తీసుకున్న తరవాత నగరంలో కొన్ని కార్యాలయాలు మీద సోదాలు జరగడం చర్చనీయ అంశమైంది. తహసీల్దార్ కార్యాలయంలో కుల, కుటుంబ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం, అవకతవకలు జరిగినట్టు రెండు రోజుల సోదాల్లో అధికారులు గుర్తించారు. కొందరు బాధితులతో ఏసీబీ అధికారులు నేరుగా మాట్లాడారు. కీలక సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం.
ఇదీ చదవండి: