ETV Bharat / state

వరుస పెళ్లిళ్లతో యువతి మహామోసం ..! - latest news in vishaka district

ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన ఓ యువతి.. విషయం దాచి తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన మూడో రోజే విషయం తెలుసుకుని.. ఆమెను వదిలించుకున్నాడు మెుదటి భర్త. ప్రియుడిని పెళ్లి చేసుకొమ్మంటే.. అతని కుటుంబంలో ధనవంతుడైన ఓ వ్యక్తిని చూపించి.. ముందు అతని నుంచి వలపు వలతో సొమ్ములాగాలని.. తర్వాత వివాహం చేసుకుందామని అన్నాడు. ఇద్దరూ కలిసి అందిన కాడికి దోచుకున్నారు. ఈలోపు రెండవ భర్తకు విషయం తెలిసిపోయింది. అక్కడి నుంచి ఆమె బయటికి వచ్చేసింది. తిరిగి ప్రియుడితో కలిసి మరో వ్యక్తిని వలపు వల వేసి.. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. ఈ కిలాడి లేడి గురించి మరికొన్ని సంగతులు.

women married with three person
డబ్బుకోసం ప్రియుడితో కలిసి మూడు పెళ్లిళ్లు
author img

By

Published : Aug 29, 2021, 5:06 AM IST

ప్రేమించి... పెళ్లి చేసుకుని తనను మోసం చేసిన యువతిపై ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగి ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు, బాధిత భర్త ప్రసాద్‌ వివరాల మేరకు... చినగంట్యాడకు చెందిన యువతిని గత ఏడాది డిసెంబరులో ప్రసాద్‌ పెళ్లి చేసుకుని లక్నో తీసుకెళ్లారు. అక్కడే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనిపించుకుని... దఫదఫాలుగా రూ.90 లక్షల వరకు తీసుకున్న యువతి గాజువాక వచ్చేసింది. మళ్లీ ఆమె తిరిగి రాకపోవడంతో బాధితుడు గాజువాక వచ్చి విచారించారు. దీంతో అంతకుముందే ఆమెకు అగనంపూడి, గాజువాకకు చెందిన ఇద్దరు యువకులతో పెళ్లిళ్లు అయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. నిందితురాలిపై ఐపీసీ 420, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

ఇదీ చదవండీ.. TRAGEDY: కుమార్తె వివాహం.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.