ఇవీ చదవండి.. ప్రేయసి ఆత్మహత్య తెలిసి.. ప్రియుడి బలవన్మరణం
గిరిజన చిన్నారి మృతి... నులిపురుగుల మందే కారణమంటున్న తల్లి - విశాఖ మన్యంలో నులిపురుగుల మందు వికటించి చిన్నారి మృతి
విశాఖ మన్యం జీ. మాడుగుల మండలం గెమ్మెలి పంచాయితీ మహాదేవపురంలో.. ఓ చిన్నారి మృతి ఆందోళనకు గురి చేసింది. తన పాప మృతికి ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇచ్చిన నులిపురుగుల మందే కారణమని చిన్నారి తల్లి ఆరోపిస్తోంది. ఈనెల 10న వైద్యసిబ్బంది నులిపురుగుల మందు ఇచ్చారని... అప్పటికే పాపకు అనారోగ్యం ఉన్నందున తగ్గాక ఇమ్మని చెప్పారని తెలిపింది. పావని ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక...11వ తేదీ మధ్యాహ్నం చిన్నారికి మందు తాగించామని... వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిందని పేర్కొంది. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని తెలిపింది.
విశాఖ మన్యంలో నులిపురుగుల మందు వికటించి చిన్నారి మృతి
ఇవీ చదవండి.. ప్రేయసి ఆత్మహత్య తెలిసి.. ప్రియుడి బలవన్మరణం