విశాఖ జిల్లా అనకాపల్లిలో గత 24 గంటల వ్యవధిలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 132కి చేరింది. శనివారం కరోనా సోకిన వారిలో గవరపాలెంలోని వీజే నాయుడు వీధికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి... చినరాజుపేటకు చెందిన 22 ఏళ్ల యువతి ఉన్నారు. దేవుడుతోట ప్రాంతానికి చెందిన 69 ఏళ్ల వృద్ధుడు, నర్సింగరావుపేట చెందిన 19 ఏళ్ల యువకుడు, చినరామస్వామి కోవెల ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. గవరపాలెం సతకంపట్టు వద్ద నివసిస్తున్న 35 ఏళ్ల వ్యక్తి, పీలానాయుడు వీధిలో ఉంటున్న 44 ఏళ్ల వ్యక్తి కూడా కొవిడ్ బారిన పడ్డారు. జీవీఎంసీ జోనల్ అధికారులు కంటైన్మెంట్ జోన్లలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి :
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 155 మందికి వైరస్