ETV Bharat / state

కంటైనర్​లో 650 కిలోల గంజాయి తరలింపు.. ఒకరి అరెస్ట్ - anantagiri police news

విశాఖ ఏజెన్సీ మీదుగా కంటైనర్ వాహనంలో మధ్యప్రదేశ్​కు తరలిస్తున్న 650 కిలోల గంజాయిని అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. బస్తాల మధ్యలో ఉంచి తరలిస్తుండగా గంజాయిని గుర్తించిన పోలీసులు.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కంటైనర్​ను సీజ్ చేశారు.

గంజాయి తరలింపు
గంజాయి తరలింపు
author img

By

Published : Aug 2, 2021, 6:55 PM IST

విశాఖ ఏజెన్సీ అనంతగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 650 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖ ఏజెన్సీ మీదుగా మధ్య ప్రదేశ్​కు కంటైనర్ వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్లు అనంతగిరి పోలీసులకు సమాచారం అందింది. అరకు సీఐ దేవుడు బాబు నేతృత్వంలో ఎస్సై కరక రాము నిఘా వేసి అనంతగిరి ఘాట్ రోడ్​లో కంటైనర్​ని పట్టుకున్నారు. కంటైనర్​లో బస్తాల మధ్యలో ఉన్న గంజాయిని పోలీసులు గుర్తించి.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న రంజిత్ బాటియ్య అలియాస్ రంజిత్ సింగ్ బాటియ్యను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు వినియోగించిన కంటైనర్​ను పోలీసులు సీజ్ చేశారు.

గంజాయిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు ఇచ్చిన ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని సీఐ దేవుడు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగానే అనంతగిరి వద్ద 650 కిలోల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. ఇకపై గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణలో పాల్గొని బంగారు భవిష్యత్తును యువత పాడు చేసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో అరకు ఎస్సై నజీర్ అనంతగిరి పోలీసులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

red sandal: చెన్నైలో చిత్తూరు పోలీసుల తనిఖీలు.. రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

ప్లేబాయ్​.. 200మంది యువతులు, వందమంది మహిళలతో...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.