ETV Bharat / state

మహిళా గ్రాండ్ మాస్టర్​గా నిలిచిన మూడో తెలుగమ్మాయి - chess star at pratusha

చిన్నతనంలోనే చదరంగంలో చిచ్చరపిడుగు అయ్యింది. మేధస్సు, ఆటోలో నైపుణ్యంతో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతకాలు సొంతం చేసుకుంది. తాజాగా ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్​ను అందుకుంది. ఈ హోదా అందుకున్న మూడో తెలుగమ్మాయిగా గుర్తింపు పొందింది విశాఖకు చెందిన ప్రత్యూష.

3rd women grand master in chess viskhapatnam pratusha
మహిళా గ్రాండ్ మాస్టర్​గా నిలిచిన మూడో తెలుగమ్మాయి
author img

By

Published : Mar 18, 2020, 4:57 PM IST

మహిళా గ్రాండ్ మాస్టర్​గా నిలిచిన మూడో తెలుగమ్మాయి
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన ప్రసాద్‌, సత్యదేవి గారాలపట్టి ప్రత్యూష. ఆరేళ్ల వయసులో కేవలం కాలక్షేపం కోసం నేర్చుకున్న చదరంగం నేడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటివరకు 24 అంతర్జాతీయ, 8 జాతీయ స్థాయి పతకాలు కైవసం చేసుకుంది.

ఆత్మవిశ్వాసం చెదిరిపోకుండా శ్రమించి... ఇంగ్లాండ్​లో జరిగిన జిబ్రాల్టర్ ఓపెన్ చెస్​ ఛాంపియన్ ​షిప్​లో 9, 5 పాయింట్లను దక్కించుకుని మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్​ అందుకుంది. ఇప్పటివరకు ఈ హోదా దేశంలో ఎనిమిది మందికి దక్కగా.. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో తెలుగమ్మాయిగా ప్రత్యూష రికార్డు సాధించింది.

ప్రస్తుతం దూరవిద్య ద్వారా డిగ్రీ చదువుతున్న ప్రత్యూష తల్లి సత్యదేవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకున్న స్ఫూర్తితోనే భవిష్యత్తులో మరిన్ని పతకాలు ఆకాంక్షిస్తున్నట్లు ప్రత్యూష పేర్కొంది.

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చానని...ఇకపై జరిగే టోర్నమెంట్లకు ప్రభుత్వం తరపు నుంచి సాయం అందిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని చెస్​ క్రీడాకారిణి ప్రత్యూష ఆశాభావంతో ఉంది.

ఇదీ చూడండి కరోనా ఎఫెక్ట్​ : క్రికెట్​ సంబర్లాలో విచిత్ర అభివాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.