విశాఖ జిల్లాలో 1,925 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు బుధవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఓ టాటా కంటైనర్ ట్రక్‌లో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందిందని తెలిపారు. నిఘా పెట్టి విశాఖ జిల్లా అగనంపూడి టోల్‌గేటు దగ్గర ఆ వాహనాన్ని గుర్తించామని వెల్లడించారు.
గంజాయి రవాణాకు వీలుగా డ్రైవర్ సీటు వెనక భాగంలో, పై భాగంలో ప్రత్యేకంగా అరలు తయారు చేయించాడని తెలిపారు. భద్రాచలంలో ఆ ట్రక్‌ను లోడ్ చేసి అలహాబాద్ తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 3.85 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: