ETV Bharat / state

గదుల అద్దె పెంపు అంశాన్ని రాజకీయం చేయడం బాధాకరం: టీటీడీ ఈవో - తితిదే తాజా వార్తలు

TTD EO Dharma Reddy Comments: తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పష్టతనిచ్చారు. వీఐపీలు బస చేసే అతిధి గృహాల్లోని 172 గదులను మాత్రమే ఆధునీకీకరించి, ధరలను పెంచామన్నారు. గదుల ధరల పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరంగా ఉందన్నారు.

TTD EO Dharmareddy
తితిదే ఈవో ధర్మారెడ్డి
author img

By

Published : Jan 12, 2023, 10:02 PM IST

TTD EO Dharma Reddy Comments: సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో అద్దె గదుల పెంపు విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో గదుల ధరల పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరంగా ఉందని, వీఐపీలు బస చేసే అతిధి గృహాల్లోని 172 గదులను మాత్రమే ఆధునీకీకరించి ధరలు పెంచామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అన్నమయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అద్దె గదుల ధరల వివరాలను ఆయన వెల్లడించారు.

ప్రముఖులకు సంబంధించి పద్మావతి, ఎంబీసీ కార్యాలయాల్లో గదుల ఇస్తారని, నారాయణగిరి, ఎస్వీ అతిథిగృహం, స్పెషల్‌ టైప్‌ అతిథి గృహాలు ఎంబీసీ కార్యాలయం కింద ఉన్నాయన్నారు. అందుకే రూ.8కోట్లతో ఆ అతిథిగృహాలను ఆధునికీకరించామన్నారు. ఏసీ, గీజర్‌ వంటి సౌకర్యాలు పెంచి గదుల అద్దె పెంచామన్నారు. ఒక్కొక్క గదికి రూ.5లక్షల చొప్పున ఖర్చు చేశామని వివరించారు.

అనంతరం తిరుమలలో ఉన్న మిగతా రూ.50, రూ.100ల అద్దె గదుల ధరలను పెంచే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. తిరుమలలో మొత్తం 7,500 గదులు, నాలుగు యాత్రిక సదన్‌లు ఉన్నాయన్నారు. రూ.50, రూ.100ల అద్దె గదులు 5వేలు ఉన్నాయని, ఈ ధరలు 40 ఏళ్ల క్రితం నిర్ణయించారని ఈవో వెల్లడించారు. రూ.50, రూ.100ల గదుల్లో ఫ్లోరింగ్‌, గీజర్లు వంటి వసతులు కల్పించామన్నారు.

తిరుమలలో అద్దె గదుల పెంపు విషయంలో రాజకీయాలు చేయడం బాధాకరం

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.