.
Viral video: మద్యం మత్తులో పాదచారి.. దారుణంగా కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్! - తిరుపతిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం
Viral Video : తిరుపతిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం వేశారు. అన్నమయ్య కూడలిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిశోర్.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని చితకబాదారు. సదరు వ్యక్తి.. కొట్టవద్దంటూ చేతులు పట్టుకొని బతిమాలినా.. కానిస్టేబుల్ కనికరించలేదు. బూటు కాలితో తన్నుతూ దాడి చేశారు. రోడ్డుపై కిందపడినా వదలకుండా వెంటపడి మరీ కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గోడవకు గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం
.