Man Suspicious Death in Palamaneru Chittoor District: పలమనేరులో అనుమానాస్పదంగా కనిపించిన ఓ మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రీతిలో మృతదేహం ఉండగా.. మృతుడ్ని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి డ్రైవర్గా పని చేస్తుండగా.. డబ్బు కోసం తన భర్తను యాజమానే వేధించి చంపాడని అతని భార్య ఆరోపిస్తోంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలో గోపి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపి స్థానికంగా ఓ వ్యక్తి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటి లాగానే అతను విశాఖకు వాహనాన్ని తీసుకెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి గత నెల 27వ తేదీన ఇంటి నుంచి వెళ్లాడు. విశాఖకు వెళ్లిన గోపి మళ్లీ తిరిగి రాలేదు.
Woman Killed and Burnt in Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. మహిళను చంపేసి కాల్చేశారు
గోపి ఇంటికి తిరిగి రాకపోవటంతో అతని సోదరుడు హరిబాబు.. ఆచూకీ తెలియటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోపి కుటుంబ సభ్యులు అతని జాడకోసం వెతకసాగారు. ఎంత వెతికినా వారికి గోపీ ఆచూకి లభించలేదు. ఈ నేపథ్యంలో పట్టణంలోని అంజనేయస్వామి ఆలయం వద్ద.. చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో మృతదేహం ఉందనే సమాచారం గోపి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహం గోపిదేనని గుర్తించారు.
గోపి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసే ఇలా చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. గోపి మృతికి యజమానే కారణమని అంటున్నారు. వాహన యజమాని ఇంటి ఎదుట గోపి మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గోపి కనిపించకపోతే వెతకటం మానేసి.. 40 వేల రూపాయలతో పరారైనట్లు యజమాని తప్పుడు ప్రచారం చేశారని గోపి కుటుంబసభ్యులు అంటున్నారు.
Murder in Eluru District: ఏలూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
"గత నెల 27వ తేదీన నా తమ్ముడు డ్యూటీకి వెళ్లాడు. ఎక్కడో బరంపూర్కి వెళ్లి.. విశాఖకు వచ్చిన తర్వాత 40వేల రూపాయలతో పరారైనట్లు యాజమాని అంటున్నాడు. మాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా.. మా తల్లిదండ్రుల దగ్గరి నుంచి ఫోటో తీసుకుని.. కనిపించటం లేదని అన్నాడు. నా తమ్ముడు నగదుతో పరారైనట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది." -మృతుని సోదరుడు
తమకు న్యాయం చేయాలని యాజమాని ఇంటిముందే ధర్నా నిర్వహించటంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారు జోక్యం చేసుకుని దహన సంస్కరాలు ముగిసిన తర్వాత.. లోతుగా విచారణ చేపడ్తమని వారు హామి ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు.