CPI Ramakrishna criticized CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో.. నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విజయసాయి రెడ్డి.. సమీప బంధువు శరత్ రెడ్డి నుంచి ముఖ్యమంత్రికి ముడుపులు అందాయన్నారు.
శరత్ రెడ్డి నుంచి రూ.9వేల కోట్లు ముఖ్యమంత్రి జగన్కు చేరాయని ఆరోపించారు. విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ సభను జయప్రదం చేసేందుకు సీఎం నానా తంటాలు పడుతున్నారన్నారు. కేసుల నుంచి బయటపడడానికే జగన్ ప్రధానికి సాగిల పడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రిని జగన్ నిలదీయాలని డిమాండ్ చేశారు. విశాఖలో కార్మికులను అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు.
ఇవీ చదవండి: