Tirumala Venkateshwara Swamy: తిరుమల శ్రీవారి సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్ల్లో ఏర్పాటు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి సర్వదర్శన టోకెన్లు జారీ ప్రారంభిస్తామని తెలిపారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా జారీ చేసే టోకెన్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రారంభ దశలో శని, ఆది, సోమవారాల్లో 25వేలు, మిగిలిన నాలుగు రోజులు 15వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. గత అనుభవనాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు లేని భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షించి దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఇవీ చదవండి: