ETV Bharat / state

ఉత్తరాంధ్రలో పాదయాత్రను అడ్డుకుంటాం.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ - మనోభావాలు

Duvvada Srinivas: అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా ఎమ్మెల్సీ ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర నిర్వహించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏదైనా దుష్పరిణామం జరిగితే దానికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని అన్నారు.

MlC Duvvada Srinivas
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌
author img

By

Published : Oct 2, 2022, 12:28 PM IST

Updated : Oct 2, 2022, 2:19 PM IST

MlC Duvvada Srinivas: అమరావతి పాదయాత్రకు అడ్డుకుని తీరుతామని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హెచ్చరించారు. పాదయాత్ర చేస్తున్న వారు అసలు రైతులే కాదని.. వారంతా పెయిడ్‌ ఆర్టిస్టులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా యాత్రలు చేస్తే సహించేదిలేదన్నారు. చంద్రబాబు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అచ్చెన్నాయుడు పెట్టుబడి దారుడని ఆరోపించారు. పాదయాత్ర వెనక్కి మళ్లీంచాలని.. లేకుంటే జరిగే ప్రతి దుష్పరిణామానికి చంద్రబాబే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్​ అన్నారు. మా ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి చూస్తే చూస్తు ఊరుకోమన్నారు. ఉత్తరాంధ్రలో రాజధానిని వ్యతిరేకిస్తున్న అచ్చెనాయుడుకి రాజకీయ పతనం తప్పదని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 2, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.