MLA DHARMANA: ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయ భూములు.. ప్రభుత్వ భూములు కావని ఆయన అన్నారు. శ్రీకాకుళం కోదండ రామాలయ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేవాలయ భూములపై ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఇష్టమొచ్చినట్లు దేవాలయాల ఆస్తులు ప్రభుత్వాలు అమ్మడానికి కుదరదంటూ హితవు పలికారు. అవి ప్రభుత్వ ఆస్తులు కాదని కోర్టులు స్పష్టంగా చెప్పాయని.. ఎమ్మెల్యే ధర్మాన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Missing Girl Identified: అమ్మ ప్రేమ కోసం.. ఆ బాలిక ఏం చేసిందంటే..!