శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురం గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన మోహన్(28) తన స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం సేద తీరటానికి పక్కనే ఉన్న చెరువుకి స్నానానికి దిగారు. అంతలోనే ఆ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులోని మొక్కల మధ్యలో చిక్కుకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక బృందం... మోహన్ మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన స్నేహితుడు మృతి చెందడంతో వారంతా షాక్కు గురయ్యారు.
ఇదీ చదవండి: లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో