ETV Bharat / state

ఉగ్రరూపంలో వంశధార, నాగావళి.. మూడో హెచ్చరిక జారీ - water

ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో... వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. గొట్టా బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

vamsadhara-nagavali-water-flow
author img

By

Published : Aug 8, 2019, 9:38 AM IST

Updated : Aug 8, 2019, 12:53 PM IST

ఉగ్రరూపంలో వంశధార, నాగావళి-మూడో ప్రమాద హెచ్చరిక జారీ

వంశధార, నాగావళి నదులకు భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో... నిన్నటి నుంచి నదులు ఏకధాటిగా ప్రవహిస్తున్నాయి. హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతున్నందున... మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొట్టా బ్యారేజీ ఔట్ ఫ్లో లక్షా 11 వేల 210 క్యూసెక్కులుగా ఉంది. వంశధారకు వచ్చిన నీటిని వచ్చినట్లు... అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు వస్తున్న వరద నీటితో... నాగావళి నది తొణికిసలాడుతోంది. తోటపల్లి జలాశయం ఇన్‌ఫ్లో 42 వేల 579.. ఔట్‌ఫ్లో 50,611 క్యూసెక్కులుగా ఉంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.... అధికారులు హెచ్చరించారు. పరివాహక ప్రాంతంలో వీఆర్​వోలు అందుబాటులో ఉండాలని.... కలెక్టర్ నివాస్ ఆదేశించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

Intro:ap_rjy_36_07_varichelu_munaka_avb_ap10019 తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వారంరోజులుగా నీటిలోమునిగిన వరిచేలు రైతులుదిగాలు

Conclusion:వారంరోజులుగాపడుతున్న వర్షాలకుతోడు గోదావరికి వచ్చిన వరదలు తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని వేలాది వరిపండించే రైతులను ఊడ్చిన నెలలోపే నట్టేటముంచాయి. నాలుగుమండలాల్లో ఏభైవేల ఎకరాల్లో వరిపండించేరైతులు ఇప్పటికే వరినాట్లు పూర్తిచేసుకున్నారు. మొదటిదశ ఎరువులనువేసారు..కలుపుతీయించి తీరిగ్గా ఇంటిదగ్గరకూర్చున్న వారికి వారంరోజులుగా కంటిమీదకునుకులేకుండాపోయింది..ఏపుగా ఎదుగుతున్నచేలు మోకాళ్ళోతు ముంపునీటితో మునిగి చెరువులను తలపించేలా ఉండటంచూసి ఆందోళనచెందుతున్నారు..ఒకటిరెండురోజుల్లో నీరుతగ్గుతుందని ఆశించినా ఎంతకూ తగ్గటంలేదు. దీనికి ప్రధానకారణం బందరు కాలువ. ఈకాలువ ఆక్రమణలకు గురికావడంతో పాటుగా గురపుడెక్క ఇతర వ్యర్థాలతో పూడికపోవడంతో వరిచేలనుండి నీరుదిగేఅవకాశం లేకపోవడంతో చేలు నీటిలోనే నానుతున్నాయి.. దీనినిదృష్టిలోఉంచుకుని కొంతమంది పంటలు వేయలేదు. అధికారులు తాముఎదొర్కొంటున్న సమస్యలను తక్షణం పరిహ్కరించాలని రైతులు కోరుతున్నారు.
Last Updated : Aug 8, 2019, 12:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.