శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామపరిధిలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సహస్ర అభిషేకాలను ఘనంగా నిర్వహించారు . సకాలంలో వర్షాలు కురవాలని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపారు. భక్తులు స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వాసుదేవరావు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూ.డాక్టర్ల రాస్తారోకో