శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో వరి చేనులో వరి నూర్పు యంత్రం అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో మిషన్ పై కూర్చున్న కనిమెట్ట గ్రామానికి చెందిన అన్నపు భారతి, పైడి సత్యవతి అక్కడికక్కడే మృతి చెందారు. భారతి భర్త ఇటీవలే క్యాన్సర్తో మృతిచెందగా... ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. సత్యవతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పొందూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.