శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నామినేషన్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సృగ్రామమైన నిమ్మాడలో.. వైకాపా తరుఫున నామినేషన్ దాఖలు చేయడానికి కింజరాపు అప్పన్న వచ్చారు. వైకాపా మద్దతిచ్చిన అభ్యర్ధితో పాటు టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ కేంద్రానికి వచ్చారు. దీంతో బయటి వ్యక్తులను గ్రామానికి తీసుకురావడం ఏమిటని నిమ్మాడ గ్రామస్థులు ప్రశ్నించారు. ఈ క్రమంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.
ఇదీచదవండి.