ETV Bharat / state

కాకరాపల్లి కాల్పులకు పదేళ్లు.. నేటికీ రద్దుకాని 1108 జీవో - కాకరాపల్లి ఘటన నేటికి పదేళ్లు

నీరు మాది, నేల మాది, స్వచ్ఛమైన గాలిమాది.. అంటూ శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి సమీపంలో థర్మల్ పవర్‌ప్లాంటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం స్వరం ఆప్రాంతంలో ఇంకా వినిపిస్తూనే ఉంది. పచ్చని పల్లెపై నెత్తురు చిమ్మిన విషాద ఘటన ఇంకా అక్కడి ప్రజల కళ్లముందు కదులుతూనే ఉంది. మా పొట్ట కొట్టొద్దు... మమ్మల్ని ఇలా బతకనీయండని గొంతెత్తిన వారిపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించిన అమానవీయ ఘటనకు పదేళ్లు నిండాయి. పోలీసు తూటాలకు అసువులు బాసిన వారు చరిత్రలో నిలిచిపోయారు. కానీ.. వారినే నమ్ముకుని జీవనం సాగించిన కుటుంబాలు మాత్రం ఆ హృదయవిదారక సంఘటనే తల్చుకుంటూ దిక్కుతోచని స్థితిలో నేటికీ తల్లడిల్లుతున్నాయి.

Kakarapalli shootings
కాకరాపల్లి కాల్పులకు పదేళ్లు
author img

By

Published : Mar 1, 2021, 2:09 PM IST

శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో జరిగిన నెత్తుటిధారకు నేటితో పదేళ్లు. పంటభూములు కాపాడుకోవడానికి చేసిన నిరసనల్లో.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఇంకా అలానే ఉన్నాయి. 2011న జరిగిన ఈ ఘటన అందరికి కళ్లముందే కన్పిస్తున్నా.. పట్టించుకున్న వారే లేరు. ఏ ప్రభుత్వం ఇప్పటికి జీవో 1108 మాత్రం రద్దు చేయలేదు.

2011 ఘటన మరువలేనిది

శ్రీకాకుళం జిల్లా.. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి సమీపంలోని నిర్మించిన ఈస్టుకోస్టు ఎనర్జీస్ థర్మల్ పవర్ ప్లాంటును వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమంలో ముగ్గురు అసువులుబాసారు. ఫిబ్రవరి 28, 2011న రైతులపై పోలీసులు కాల్పులు జరిపగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏటా ఘటనను తల్చుకుంటూ ఉద్యమకారులంతా నివాళులు అర్పిస్తున్నా.. ఆయా కుటుంబాలను మాత్రం ఆదుకునేవారే కరువయ్యారు. అప్పట్లో బాధిత కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించారు. బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. అప్పుడు భరోసా ఇచ్చిన వారే అధికారంలోకి వచ్చినా... పవర్‌ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన జీవో 1108 మాత్రం నేటికీ రద్దుకాలేదు.

రాష్ట్రప్రభుత్వం అనుమతులు

కాకరాపల్లి భూముల్లో 2008లో అప్పటి రాజశేఖరరెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావనపాడు థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.12వేల కోట్ల ఖర్చుతో 2,640 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. జాతీయ అప్పిలేట్ అథారిటీ షరతుల మేరకు చివరిగా వడ్డితాండ్ర, ఆకాశలఖవరం, కాకరాపల్లి తంపర భూముల ప్రాంతాల్లోని 2,300 ఎకరాల్లో ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

అగ్నికి ఆహుతైన గ్రామం..

భూ సేకరణ సమయంలో ఆకాశలఖవరం, వడ్డితాండ్ర, హనుమంతునాయుడు పేట ప్రాంత రైతులు, ప్రజలు ప్రాజెక్టును వ్యతిరేకించారు. తమ పంటభూములు పోతాయని, పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన చేశారు. 2009, ఆగస్టు 15న కాకరావల్లి థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2011, ఫిబ్రవరి 24న పోలీసులు, ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో వడ్ఢితాండ్ర గ్రామం అగ్నికి ఆహుతైంది. 50కి పైగా ఇళ్లు కాలిపోయాయి.

ముగ్గురిపై పోలీసుల కాల్పులు..

అనంతరం 28న హనుమంతు నాయుడు పేట గ్రామ కూడలిలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరి త్యాగానికి గుర్తుగా ఉద్యమ కారులు అక్కడ స్మృతి స్తూపం నిర్మించారు. ఘటన జరిగి పదేళ్లు కావడంతో అక్కడ ఆదివారం ఉద్యమకారులు నివాళులర్పించారు. 1108 జీవో రద్దు చేయాలని నినాదాలు చేశారు.

పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు

రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలే కాని ఊరికోసం ఊరిజనం కోసం వారంతా కదనరంగంలోకి దిగారు. తన తోటివారితోనే వారూ పరుగులు పెట్టారు. కానీ తూటాదెబ్బకు బలయ్యారు. అప్పటి కాల్పుల్లో ఆకాశలఖవరం పంచాయతీకి చెందిన సీరపు ఎర్రయ్య, జీరు నాగేశ్వరరావు, బత్తిని బారికివాడు మృతిచెందారు. అప్పట్లో ప్రభుత్వం వారికి రూ. 5 లక్షల పరిహారం అందజేసింది.

నేటికి హామీలు నేరవర్చలేదు..!

ఒక్కో కుటుంబానికి ఎకరా భూమి, ఇళ్లు నిర్మించి ఇస్తామని, పిల్లల చదువుతో పాటు ఇతర బాధ్యతను చూసుకుంటామని నేతలు,అధికారులు హామీ ఇచ్చినా అవి నేటికీ నెరవేరలేదు. రెండు బాధిత కుటుంబాలకు గ్రామ శివారులోని కొంత పోరంబోకు భూమిని చూపించినా దానికి సంబంధించిన హక్కులు ...మాత్రం నేటికీ కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చూడండి:

పాకాల వైకాపా నేతపై దాడి చేసింది... సొంత పార్టీ నేతలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.