రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకని తెదేపా నేత కూన రవికుమార్ సీఎం జగన్ను ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు..,రైతుల ఉసురు తీసే కేంద్రాలుగా మారాయని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ ధాన్యం ఇప్పటికీ కొనుగోలు చేయలేదని విమర్శించారు. అన్నదాతలను ఆదుకోవాలని వైకాపా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పొలాల్లో మగ్గుతున్న మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి