ETV Bharat / state

సంతబొమ్మాళిలో ఎన్టీఆర్​, ఎర్రన్నాయుడు విగ్రహాలు ధ్వంసం - nara Lokesh latest news

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో దివంగత ఎన్టీఆర్​, ఎర్రన్నాయుడు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

santhabommali
santhabommali
author img

By

Published : Jan 12, 2021, 9:08 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్​, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై మండల తెదేపా నాయకులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు ఉద్దేశపూర్వకంగానే విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... విగ్రహాలను పరిశీలించారు.

ఈ ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. దేవుళ్లు, రాజకీయ నాయకుల విగ్రహాల జోలికి వెళ్లవద్దని అచ్చెన్నాయుడు కోరారు.

  • దేవతా విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వైకాపా దుష్టులే ఇప్పుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసారు. నిలబెట్టడం చేతగాని జగన్ రెడ్డి గొప్ప వ్యక్తుల విగ్రహాలు కూల్చి వికృతానందం పొందుతున్నాడు.(1/2) pic.twitter.com/8Xagb4V9jG

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేవతా విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వైకాపా దుష్టులే సంతబొమ్మాళి ఘటనకు పాల్పడ్డారు. నిలబెట్టడం చేతగాని జగన్ రెడ్డి గొప్ప వ్యక్తుల విగ్రహాలు కూల్చి వికృతానందం పొందుతున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: దొంగగా మారిన కానిస్టేబుల్... ఉన్నతాధికారి ఇంటికే కన్నం !

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.