శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో మొక్కజొన్న పంటను 21 మండలాల్లో సుమారుగా 16 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఏడాది నుంచి జిల్లాలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను ప్రధానమంత్రి పసల్ భీమా యోజన పథకంలో చేర్చడంతో రైతులు సాగుకై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ కాలంలో రైతుకు మంచి ఆదాయం వచ్చే మొక్కజొన్న పంట చేసినప్పటి నుంచి 110 రోజుల్లో రైతు చేతికి అందివస్తుందని పలువురు రైతులు చెబుతున్నారు. సాగునీరు పుష్కలంగా ఉన్న చోట ఏడాదిలో మూడు పంటలను సాగు చేసుకోవచ్చు. గతేడాది రబీ నుంచి మొక్కజొన్న పంటకు మంచి మద్దతు ధర లభించడంతో రైతులు మరింత ఉత్సాహంగా పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు, రణస్థలం, జి సిగడం, ఎచ్చెర్ల మండలాల్లో అత్యధికంగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. ఒక్క ఈ నాలుగు మండలాల్లోని 10 వేల హెక్టర్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ ఏడీఏ చంద్ర రావు తెలిపారు. వర్షాధార ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఇదీచూడండి.నవ్యాంధ్రలో జల శక్తి అభియాన్‌కు శ్రీకారం