Sri Mahalakshmi Thalli Jathara: ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లిగా పిలవబడే శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడాంలో మూడు రోజుల పాటు జరగనున్న జాతర.. కన్నులపండువగా సాగుతోంది. బంటుపల్లి గ్రామం నుంచి పల్లకిలో తాళిబొట్టు, పసుపు, కుంకుమలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి కల్యాణం వేదపండితుల మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు.
జాతర మహోత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరిలు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ప్రాంతంలో అమ్మవారి కల్యాణం జరిగిన తర్వాతే యువతీ యువకులు వివాహాలు చేసుకోవడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ. రణస్థలం మండలపరిధిలో ఉన్న సుమారు 20 గ్రామాల ప్రజలు.. సంక్రాంతి కంటే శ్రీ మహాలక్ష్మి తల్లి జాతరనే పెద్ద పండుగగా భావిస్తారు.
ఇదీ చదవండి: Antarvedi: అంతర్వేదిలో రమణీయంగా సాగిన నారసింహుడి కల్యాణ మహోత్సవం