శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి, కుమారుడు కరోనా బారి నుంచి కోలుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుంచి అందరూ డిశ్చార్జయ్యారు. ఈ ముగ్గురూ ఇటీవలే కొవిడ్ బారిన పడి శ్రీకాకుళంలోని మెడి కవర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
మనోధైర్యంగా ఉండాలి..
మధ్యాహ్నం సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికెళ్లారు. కరోనా సోకిన ప్రజలెవరూ ఆందోళన చెందకుండా మనో ధైర్యంతో ఉండాలని స్పీకర్ పిలుపునిచ్చారు. తమకు మెరుగైన చికిత్స అందించిన ఆస్పత్రి యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి తమ్మినేని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవీ చూడండి : కొవిడ్ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు