రాష్ట్రంలో రెండు ఫ్యామిలీ పార్టీలు ట్రేడింగ్ చేస్తున్నాయని...,కుటుంబ పార్టీలకు రానున్న రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో భాజాపా శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని... భవిష్యత్తులో భాజపా అధికారంలోకి వస్తే కార్పొరేషన్లను కార్పొరేట్ సంస్థగా అభివృద్ధి చేస్తుందన్నారు.
ఇసుక విధానం బాలేదన్న ఆయన... ప్రజలకు తక్కువ ధరకే ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ఆర్జీఎస్ నిధుల వినియోగంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు, నాడు-నేడు పనులు, గ్రామ సచివాలయాలతోపాటు పలు అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయని తెలిపారు. అయినా... ఒక్క పథకంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ పేరు గానీ బొమ్మగానీ కనిపించకపోవడం శోచనీయమన్నారు. పోలవరం పూర్తి చేస్తే 50 వేల కోట్ల ఆదాయం ప్రతి ఏడాది వస్తుందని... దీనితో పోలిస్తే ప్రత్యేక హోదా ఎంతని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం అక్షయపాత్రని వ్యాఖ్యనించారు. ఎన్నికల కమిషన్ అన్నింటిని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి
ఎన్జీవోస్ స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను : శ్రీరాం తాతయ్య