కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద నిబంధనలు విధించింది. దుకాణాలకు వచ్చేవారు విధిగా మాస్కులు ధరించి, గొడుగు పట్టుకుని ఉండాలని అధికారులు చెప్పారు. కానీ శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరున్న మద్యం దుకాణాం వద్ద పరిస్థితి మరోలా ఉంది. అధికారులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టారు. మాస్కులు వేసుకుని వచ్చినా... భౌతిక దూరాన్ని మరిచారు. గొడుగులు ఒకరిద్దరు వెంట తెచ్చుకున్నా...మిగతా వారు అవేమీ లేకుండా మద్యం షాపు దగ్గర బారులు తీరారు.
ఇదీ చదవండి :