శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురంలోని పురాతన సీతారాముల ఆలయంలో.. వార్షిక కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 16వ శతాబ్దంలో బొబ్బిలి రాజ వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
వార్షికంగా ఇక్కడ కల్యాణోత్సవ నిర్వహణ.. ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా.. భక్తులు లేకుండానే వేడుక పూర్తయింది. ఆలయ పురోహితులు భోగాపురం ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణం శాస్త్రోక్తంగా జరిగిందని ఈవో శ్యామల రావు తెలిపారు.
ఇదీ చదవండి: