రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే కళావతి కోరారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో నిర్వహించిన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వానికి రైతు సంక్షేమమే ప్రధానమన్నారు. సీఎం జగన్ చెప్పినట్లు... విత్తన చట్టం ఉంటేనే నకిలీ విత్తనాలకు అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చే రైతు భరోసా పథకాన్ని...అర్హులైన రైతులందరికీ అందించాలన్నారు. అధిక దిగుబడి ఇచ్చి, తెగుళ్ళను తట్టుకునే విత్తనాలను రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందించే విత్తనాలను రైతులు వినియోగించుకుని సాగులో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందివ్వాలి : ఎమ్మెల్యే కళావతి - ఎమ్మెల్యే కళావతి
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నిర్వహించిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆమె అధికారులను కోరారు.