మొన్నటివరకు కరోనా కేసులు లేని శ్రీకాకుళం జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదుకావడంపై విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురం చెక్పోస్టును ఓఎస్డీ మోహనరావు, ఏఎస్పీ బిందుమాధవ్ తనిఖీ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని అక్కడి అధికారులకు సూచించారు. అత్యవసర వాహనాలు తప్ప వేరే వాటిని అనుమతించవద్దని ఆదేశించారు.
ఇవీ చదవండి..