ETV Bharat / state

గ్యాస్ ట్యాంకర్ బోల్తా... ఆందోళనలో గ్రామస్తులు - gas lorry bolta in anantapuram district

అనంతపురం జిల్లాలోని మురారాయన పల్లి గ్రామంలో గ్యాస్ ట్యాంకర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

gas lorry bolta in anantapuram district
అనంతపురం జిల్లాలో గ్యాస్ ట్యాంకర్ లారీ బోల్తా
author img

By

Published : Apr 27, 2020, 5:45 PM IST

అనంతపురం జిల్లాలో గ్యాస్ ట్యాంకర్ లారీ బోల్తా

అనంతపురం జిల్లాలో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. మడకశిర నియోజకవర్గ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలోని మురారాయనపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు లారీ పల్టీ కొట్టింది. ప్రమాదంలో ట్యాంకర్‌ బాగా దెబ్బతిని... గ్యాస్ లీక్ అయ్యింది. ట్యాంకర్ నుంచి డ్రైవర్ బయటపడి గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయం గురించి చెప్పగా.. విషయం పోలీసుల వరకూ వెళ్లింది.

పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరా ఆపివేసి, ట్యాంకర్ ఉన్న ప్రదేశం లోకి ఎవరికీ అనుమతించకుండా గట్టి బందోబస్తు చేపట్టారు. నిప్పుతో బీడీ, సిగరెట్, పొయ్యి తో పాటు నిప్పుతో వెలిగించే ఏ పరికరాలు ఉపయోగించరాదని ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం పక్కనే ట్రాన్స్​ఫార్మర్ ఉన్న కారణంగా ఏ క్షణాన ఏమి జరుగుతుందో అన్న భయంతో గ్రామస్తులు దూరప్రాంతాలకు భయంతో పరుగులు తీశారు. మరికొందరు అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.

ఇవీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.