రెండవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం భక్తలతో కిటకిటలాడుతోంది. భారీ సంఖ్యలో భక్తులు హజరై ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. వేకువజామున నాలుగు గంటల నుంచే భక్తులు విచ్చేస్తుండటంతో క్యూ లైన్ల లో రద్దీ కనిపిస్తోంది. ఆలయంలో జరిగిన కుంకుమ పూజలలో సుమారు1500 మంది మహిళలు పాల్గొన్నారు.
ఇదీచూడండి.కేరళ: కుండపోత వర్షానికి చెరువులైన వీధులు