శ్రీకాకుళం జిల్లా అంతటా రాత్రి నుంచి వాతావరణలో మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వాన కురిసింది. గార, ఆమదాలవలసలో భారీ వర్షం పడింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎండిపోతున్న వరి నాట్లకు ఈ వర్షం ఊరటనిచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదే వర్షం 15 రోజుల క్రితం పడి ఉంటే పంటలు బాగా పండేవని కర్షకులు చెబుతున్నారు. శ్రీకాకుళంతో పాటు వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, భామిని, లావేరు, జి.సిగడాం, పోలాకి, నరసన్నపేట, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో చిరు జల్లులు పడ్డాయి.
ఇవీ చదవండి: