శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఏర్పాటు చేసిన ఏటీఎంను దొంగలు ఎత్తుకువెళ్లిపోయారు. పలాస మండలం లక్ష్మీపురంలోని జాతీయ రహదారి పక్కన ఏటీఎం మిషన్ ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా... విడివిడిగా భాగాలు చేసిన ఏటీఎం మిషన్ కనిపించింది. వెంటనే పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందిచారు. పంటపొలాల్లో దొరికిన ఏటీఎంను అధికారులు పరిశీలించారు.
ఇదీ చదవండి: హస్తినలో వైయస్ జయంతి వేడుకలు