ETV Bharat / state

పాతపట్నంలో మరో కరోనా పాజిటివ్​... యంత్రాంగం అప్రమత్తం - పాతపట్నంలో మరో కరోనా పాజిటివ్​ కేసు

శ్రీకాకుళం జిల్లాలో మరో కరోనా కేసు నమోదు కావడం కలకలం రేపింది. రెండ్రోజుల క్రితం పాతపట్నం పరిధిలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్​గా తేలగా అదే కుటుంబంలో మరో వ్యక్తికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. 18 గ్రామాలను రెడ్​జోన్​గా గుర్తించి.. అక్కడ నిత్యావసరాలు పంపిణీ చేశారు.

one more corona case found in pathapatnam
శ్రీకాకుళం జిల్లాలో మరో పాజిటివ్​ కేసు నమోదు
author img

By

Published : Apr 27, 2020, 4:33 PM IST

శ్రీకాకుళం జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా పాతపట్నం పరిధిలో ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్​ రాగా.. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి వైరస్​ సోకింది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల 18 గ్రామాలను రెడ్​జోన్​గా గుర్తించారు. ఆయా గ్రామాలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. పాతపట్నం మేజర్ పంచాయతీలోని కొన్ని వీధుల్లో కూరగాయలు, పండ్లు సరఫరా చేశారు. ప్రజలు బయటకు రాకుండా పోలీసులు లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇది పోలీసుల విన్నపం... మీరూ వినండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.